హ్యాపీ వాలెంటైన్స్ డే..

396
valentine day
- Advertisement -

యువతకు పండగే. అసలే ప్రేమ పక్షులు… ఏకాంత ప్రాంతానికి ఎగిరిపోవాలని అందమైన గులాబీలతో తమ ప్రేమను పరస్పరం వ్యక్తీకరించుకొవాలని భావిస్తుంటారు. పువ్వుల్లోని పరిమళం, మకరందం జీవితంలోనూ ఉండాలని, మది నిండా ఆ పరిమళాలను ఆస్వాదిస్తూ కొన్ని ప్రత్యేకమైన క్షణాలు, ఆ అనుభూతిని జీవితాంతం నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రేమికుల రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తమ మనుసులోని ఫీలింగ్‌ను గిఫ్ట్‌ల ద్వారా ఎక్స్ ప్రెస్ చేయాలని కొందరు భావిస్తుంటే… మరికొందరు తమ లవ్ రిలేషన్ ను లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంకొంతమంది గిఫ్ట్ గ్రీటింగ్ కార్డులతో తమ పార్ట్ నర్ ను సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రేమ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. పూలపరిమళం లాంటి ప్రేమ మాధుర్యాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలనుకుంటున్నారు ప్రేమికులు. పల్లెల నుంచి పట్టణాల వరకూ అక్కడ నుంచి నగరాలకు ప్రేమాలయాలు పెరిగిపోతున్నాయి. అసలు ఫిబ్రవరి 14కి వాలెంటైన్స్ డే ఎలా గుర్తింపు వచ్చిందంటే… క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్‌లో వాలెంటైన్స్‌ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి, వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్స్‌కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్‌ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది.

దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్‌ వాలెంటైన్‌కి మరణశిక్ష విధించాడు. ప్రేమకు మారుపేరుగా మారిన వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. ఎక్కడో రోమ్‌లో, అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది.

ప్రేమికుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అవగాహన, నమ్మకం రోజురోజుకు ఆవిరైపోతున్నాయి. నేటి సమాజంలో ప్రేమికుల మధ్య ప్రేమ కంటే ఆకర్షణే ఎక్కువగా కనబడుతోంది. ప్రేమంటే… కళ్ల ముందున్న ప్రేయసిని చూసి మురిసిపోవడం కాదు, ఆ ప్రేమ కనుమరుగైనప్పుడు కలవరపడడం, నిత్యం ఆ జ్ఞాపకాలతోనే బతకడం కూడా ప్రేమే. అలాంటి ఈరోజును మధురానుభూతి పంచేలా.. ప్రేమ త్యాగాన్ని మాత్రమే కోరుకుంటుందని గుర్తుచేస్తూ గ్రేట్ తెలంగాణ.కామ్ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది..

Also Read:ట్రాఫిక్ రూల్స్‌ను పాటించండి:తేజ్

- Advertisement -