ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది. నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి…అయినా ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి….జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు…సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే …ఉపాధ్యాయుడు – సృష్టి స్థితి లయల నిర్దేశకుడు.. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది.
మన సంస్కృతిలో, గురువుకి, చాలా గొప్ప స్థానం ఉంది.. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవఅని అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత అంతటి వారుగా గురువుని కీర్తించారు వారు… “గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం. మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యుత్తన్నత పదవిని అలంకరించిన సర్వేపల్లి అందరికీ ఆదర్శనీయుడిగా నిలిచారు.
నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విద్యావేత్త, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, స్వరాష్ట్రంలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని కడియం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరినీ సగౌరవంగా సన్మానించుకుందామన్నారు.