హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి .ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు.
దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు.
తండ్రి మాట జవదాటని శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యలో పట్టాభిషక్తుడయ్యాడు. అప్పటినుండి భక్తుల గుండెల్లో కొలువై,సుందర సుమధుర చైతన్య రూపమై,కోట్లాది మంది భక్తుల పూజలందుకుంటున్నాడు.
శ్రీరామ చంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడంతో భద్రాచలంకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.నేటికి భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తలకు దర్శనమిస్తూ ఉంటుంది. రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగివచ్చింది శ్రీరామనమవినాడే. ఆ మరునాడు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అందుకే కోదండ రాముని కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల దేవతలు దివి నుండి భువికి దిగివచ్చి కల్యాణ మహోత్సవాన్ని చూసి పులకించిపోతారట. శ్రీరాముడు సత్యపాలకుడు,ధర్మాచరణం తప్పనివాడు,ఏకపత్నీ వ్రతుడు,పితృ,మాతృ,నిగ్రహం,సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు.అందుకే ప్రతి ఏటా భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుందని భక్తుల విశ్వాసం.
ఇవి కూడా చదవండి..