- Advertisement -
అనురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం- రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో, రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమివేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమనాడు, ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లివిరుస్తాయి. సామరస్య సంతోషాలు సోదర సోదరీమణుల మధ్య వ్యక్తమవుతాయి.
ఉత్తర భారతంలో విశేష వ్యాప్తి చెందిన ఈ సంబరం, కాలక్రమంలో దేశమంతటా విస్తరించింది. సోదరులు క్షేమంగా ఉండాలని ఆక్షాంక్షిస్తూ ఆడపడుచులు రాఖీని కడుతారు. కాలానికనుగుణంగా రాఖీలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. బాంధవ్యాల్లోని మాధుర్యానికి గుర్తుగా వ్యక్తుల మధ్య విడదీయరాని బంధానికి గుర్తే రాఖీ పౌర్ణమి ముఖ్యోద్ధేశం.
- Advertisement -