సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. పురాణ ప్రాశస్త్ర్యాన్ని చాటి చెప్పే ఉత్సవం. పట్టు చీరల్లో పల్లె పడుచులు. పంచె కట్టులో పోట్ల గిత్తలు. ఎక్కడ చూసిన ఏనుగు స్వారీలు. పడవ పందాలు, భోజన ప్రియులకు నోరూరించే వంటకాలు. ఆహారం, ఆహార్యం అంతా ప్రత్యేకం. ప్రకృతి అంతా ఒక్క చోటె కొలువు దీరిన నేలపై అంబరాన్నంటే సంబరాలు.. ఇదంతా కేరళలో ఓనం పండుగ విశేషాలు..
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగలాగానే కేరళలలో ఓనం పండుగను జరుపుకుంటారు. వామనావతారంలో పాతాళంలోకి బలిచక్రవర్తిని నెట్టిన విష్ణుమూర్తి, బలిచక్రవర్తి కోరిక మేరకు ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిచ్చాడు. దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది భక్తుల నమ్మకం. ఆ రోజే ఓనమ్ పండుగ అతి వైభవంగా జరుపుకుంటారు. పేదవాళ్లు, ధనవంతులు అని భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా పండుగ వేడుకలను జరుపుకుంటారు.
రంగురంగుల రంగవల్లులు. రకరకాల పూలతో చూడముచ్చటైన అలంకరణలు. ఇళ్లూ వాకిళ్లను అంత్యంత సుందరంగా ముస్తాబు చేసి చిన్నా పెద్దా అంతాకలిసి సందడి చేసే పండుగ ఓనమ్. ఓనమ్ పండుగ అంటే మలయాళీలకు అత్యంత ప్రీతి పాత్రమైంది. ఓనమ్ పండుగ వచ్చిందంటే చాలు.. మలయాళీలు ఎంతో హుషారుగా సందడి చేస్తూ.. ఆటపాటలతో హంగామా చేస్తారు. సాంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో అదరహో అన్పిస్తారు.
కేరళ దేశాన్ని మహాబలి చక్రవర్తి పరిపాలించినట్టు పురాణాలు సూచిస్తుండగా, ప్రతి సంవత్సరం ఆయన తమను పలకరించేందుకు వస్తాడని నమ్మి, ఎదురు చూసే రోజునే ఓనం పండుగగా కేరళీయులు జరుపుకుంటున్నారు. తిరుమరై అడవుల్లో వెలిసిన తిరుమాల్ గర్భగుడిలోని దీపం ఆరిపోయే సూచనలున్న సమయంలో ఓ ఎలుక అటువైపు వెళుతూ ఆ దీపంలో ఉన్న వత్తిని తనకు తెలియకుండానే కదిలించడంతో ఆరిపోబోయిన దీపం ప్రకాశవంతంగా వెలుగొందింది.ఈ పుణ్యఫలితంగా ఆ ఎలుక తర్వాతి జన్మలో ప్రహ్లాద ఆళ్వారుని మనుమనిగా అవతరించి విశ్వమంతా పూజించే మహాబలి చక్రవర్తిగా రాణించాడని పురాణం చెబుతోంది.
Also Read:బాబోయ్.. కుర్ర హీరోతో రొమాన్స్
తెలియక చేసిన మంచిపని ద్వారా దైవకౄఎపకు పాత్రుడైన బలిచక్రవర్తి తన ప్రజలను కరవుకాటకాల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడాడని, ప్రజల ఆరాధ్య దైవంగా కొలవడంతో బలిచక్రవర్తి అహంకారం పెరిగిందని పురాణంలో ఉంది. తనకు మించిన ధర్మాత్ముడు, దైవం లోకంలో ఎవరూ లేరని బలిచక్రవర్తి విరవ్రీగాడు. అతని గర్వాన్ని అణగదొక్కేందుకు భగవంతుడు వామన అవతారం ఎత్తడం, బలికి విశ్వరూప దర్శనమిచ్చిన వాధానం, మూడో అడుగుగా బలి శిరస్సుపై తన పాదం మోపి వరమిచ్చిన సంగతులు గుర్తుచేసుకుంటూ ఓనం పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు.
అథమ్‌తో తొలి రోజు వేడుకలు ప్రారంభమయి తిరుఓనమ్‌తో పది రోజుల సంబరాలు ముగుస్తాయి. ఇందులో తిరుఓనమ్ చాలా ముఖ్యమైనది. ఈ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఇందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం వారికి ఉంది. ఈ పండుగ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా… ఏనుగుల స్వారీలు, అందమైన తెల్లచీరలతో మగువలు. అంతా కోలాహలంగా ఉంటుంది. ఈ పండుగ ప్రత్యేకత పడవ పందాలే. ఈ పండుగ సందర్భంగా ఇంటిని పేడనీళ్లతో అలికి రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరిస్తారు. దీనిని వల్లమ్‌కలి అని అంటారు. సాంప్రదాయక పడవలు ఈ పందేల్లో పాల్గొంటాయి. ఈ పండుగ మలయాళీయలదే అయినప్పటికీ, అన్ని వర్గాలవారూ జరుపుకుంటారు.
Also Read:పిక్ టాక్ : టెంపరేచర్ పెంచేసిన రాశి