నాన్నంటే.. భద్రత.. భరోసా.. బాధ్యత. నాన్నంటే ఒక రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్. నాన్న మనసు అర్థం కాని అంతరిక్షం. ఆయన హృదయం తెలుసుకోలేని అనంత సాగరం.. ఫాదర్స్ డే సందర్భంగా నడిపించే దైవం నాన్నకు.. ప్రేమతో…
తల్లి నవ మాసాలు మోసి కంటే.. మనల్ని నడిపించే దైవం నాన్న. నాన్నంటే ధైర్యం.. అంతకుమించిన త్యాగం అతడు. చేయి పట్టి నడిపిస్తూ.. ఆడిస్తూ.. అల్లారుముద్దుగా పెంచుతాడు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు నాన్న. తను తిన్నా, తినకపోయినా.. తన దుస్తులు బాలేకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ లోటూ రాకుండా ఉండాలని పరితపించే వ్యక్తి నాన్న. పిల్లలు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే ఎంతో సంతోషపడతాడు. వాళ్లు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు.
Also Read:ఘనంగా “రాజధాని రౌడీ” సక్సెస్ మీట్
అందుకే ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డేను నిర్వహిస్తారు. మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాన్నకు ఏమిచ్చినా తక్కువే. అయితే.. మనం ఇచ్చే ఆ కానుక నాన్నపై మనకున్న ప్రేమను చూపిస్తుంది. అంతకుమించి ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి ఇదో మంచి అవకాశం.
మీ అవసరాలు తీర్చడంలో తన అవసరాలను పక్కనపెట్టే నైజం నాన్నది. అందుకే అందుకే ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమించడం.. అలాగే అమ్మని మదర్స్ డే రోజే పూజించడం.. నాన్నను ఫాదర్స్ డే రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం.. కాదు.. సంవత్సరంలో 365 రోజులూ ప్రేమిద్దాం.
Also Read:Vishnu:ప్రతి సోమవారం కన్నప్ప అప్‌డేట్