హ్యాపీ బర్త్ డే…విశాల్

53
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. సహాయదర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటరైన విశాల్ తర్వాత హీరోగా, నిర్మాతగా, సంఘ సేవకుడిగా అందరి మన్నలు పొందారు. ఇవాళ విశాల్ బర్త్ డే సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

జి.కె.రెడ్డి, జానకీదేవిలకు 29 ఆగస్టు 1975న చెన్నైలో జన్మించారు విశాల్. చెన్నైలో స్థిరపడిన తమిళ, తెలుగు సినీ నిర్మాత జి.కె.రెడ్డి. ఆయన అన్నయ్య విక్రమ్ కృష్ణ, అజయ్ అనే స్క్రీన్ పేరుతో సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తరువాత విశాల్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

Also Read:కన్ఫ్యూజన్ లో పడ్డ కాంగ్రెస్?

2004లో చెల్లమే సినిమాలో హీరోగా నటించారు. సందకోళి(2005) సినిమాలో తన తండ్రి నిర్మాణ సంస్థలో సహ దర్శకునిగా పనిచేసిన ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో నటించారు. 2006లో డిష్యుం, తిమిరు ,సివప్పదిగారం, 2008లో విడుదలైన తామిరభరణి మాత్రం మంచి హిట్ అయింది. ,ప్రభుదేవా దర్శకత్వంలో వేది,సమర్ ,థీయ వెలై సేయ్యనుమ్ కుమారు సినిమాలో అతిథిపాత్రలో, పట్టథు యానై, పాండియ నాయుడు సినిమాల్లో హీరోగానూ నటించారు.

విశాల్ నటించిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగా నటిస్తునే తన స్వంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీతో సినిమాలను నిర్మించారు.

Also Read:ఎన్టీఆర్ చాలా నేర్చుకోవాలి!

- Advertisement -