హ్యాపీ బర్త్ డే…సునీల్

133
hbd sunil
- Advertisement -

మాట విరుపు, యాస పలుకు, ముఖ కవళికలతోనే తనదైన మార్క్‌ వినోదాన్ని పండిస్తూ సందడి చేయడం ఆయన శైలి. తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలతో హాస్యం పండించిన తర్వాత హీరో అవతారం ఎత్తిన కామెడీ హీరో సునీల్. ‘అందాల రాముడు’ తో అలరించిన ఆ తర్వాత ‘మర్యాద రామన్న’, ‘పూలరంగడు’గా సందడి చేసిన ఆయనకే చెల్లింది. తనదైన శైలిలో హీరోగా దూసుకుపోతున్న సునీల్ పుట్టినరోజు నేడు.

1974 లో పుట్టిన సునీల్ తన బాల్యం భీమవరం లో గడిపారు. డాన్స్ మీద ఉన్న ఆసక్తి చిరంజీవి గారంటే ఉన్న అభిమానం ఆయన్ని సినిమా వైపు వచ్చేలా చేసింది బి.ఏ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేసిన సునీల్ డాన్సర్ గా,ఆర్ట్ డైరెక్టర్ గా విలన్ గా కూడా ప్రయత్నించారు కాని “నువ్వే కావాలి” చిత్రం లో అవకాశం వచ్చాక ఇంకా వెను తిరిగి చూడలేదు. ఈ సినిమా సునీల్‌కు మంచి గుర్తింపు తేవడమే కాదు ఉత్తమ హస్యనటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత పెద్ద సినిమా ఐనా చిన్న సినిమా ఐన సునీల్ ఉండాల్సిందే. అందుకు తగ్గట్టే ఆయన పాత్రల పేర్లు వెరైటీగా అందరికీ గుర్తుండిపోయేలా ఉండేవి.బంతి, బంకు శీను, బూస్టు, కపిల్‌,బుల్లెబ్బాయి, పెందుర్తి బాబు,పంచింగ్‌ ఫలక్‌నామా,రజనీ హాసన్‌, బుజ్జి, బాబ్జి ఇలా సునీల్ పోషించిన పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

జక్కన్నతో చేసిన మర్యాద రామన్న సునీల్‌ కెరీర్‌లో మరచిపోలేని గుర్తుగా మిగిలిపోయింది. హీరోగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శించిన సునీల్ సిక్స్ ప్యాక్‌తో సైతం అలరించాడు. క్యారెక్టర్ ఏదైనా తనదైన నటనతో మెప్పిస్తున్న సునీల్ మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్పూర్తిగా కొరుకుంటూ greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -