‘నీకోసం’ నుండి నేటి ‘ఆగడు’ వరకు వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు.. సినిమాపై ఆయనకు విపరీతమైన వ్యామోహం. సినిమానే ఆయన శ్వాస.. అవకాశాల కోసం అందరిలానే తిరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు సక్సెస్ ఫుల్ దర్శకునిగా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న మిస్టర్ శ్రీను వైట్ల పుట్టిన రోజు నేడు.ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
1972 సెప్టెంబర్ 24న ఈస్ట్ గోదావరి జిల్లాలోని కందులపాలెం గ్రామంలో జన్మించిన శ్రీనువైట్ల సినిమా మీదున్న ఫ్యాషన్ తో చెన్నై చేరాడు. కథలు రాయడం, నాటకాలు వేయడం ఇలాంటివి ఏవీ లేవు. కానీ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో రూ.1400 జేబులో పెట్టుకుని మద్రాసు వెళ్లారు. రైల్లో పరిచయమైన కుర్రాడు ఇచ్చిన అడ్రస్‌తో అతని స్నేహితుడిని కలిసి రెండు రోజులు పాటు అతని గదిలో ఉండేందుకు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణవంశీతో పరిచయం, సినిమా అవకాశాల కోసం తిరగడం షరా మామూలు.
‘శివ’ సినిమాతో రాంగోపాల్‌వర్మ పేరు మార్మోగిపోవడంతో ఆయన వద్ద సహాయకుడిగా చేరేందుకు హైదరాబాద్ వెళ్లారు. అయితే అప్పటికే చాలామంది ఆయన వద్ద పనిచేస్తుండటంతో చివరకు దర్శకుడు సాగర్ వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అలా ‘నక్షత్ర పోరాటం’, ‘అమ్మదొంగా’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తొలి సినిమాతోనే నీకోసం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని కమర్షియల్‌గా పర్వాలేదనిపించింది. ఈ సినిమా చూసిన నాగార్జున శ్రీనుకు సినిమా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రామోజీరావు ‘ఆనందం’ సినిమాకు అవకాశం ఇచ్చారు. ‘ఆనందం’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో శ్రీనువైట్ల వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల కెరియర్ లో ఆనందం, దూకుడు, డీ, రెడీ, వెంకీ వంటి సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి.‘ఖలేజా’ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, గత చిత్రాలతో పోలిస్తే మహేష్‌కు ఉన్న ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది.
జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు కామెడీ మార్క్ సినిమాలను డైరెక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుత జనరేషన్ కి అలాంటి సినిమాలను అందిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల. స్టార్ హీరోలతో కమర్షియల్, కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలను తెరకేక్కిస్తూ సక్సెస్ అందుకుంటున్న శ్రీనువైట్ల ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ కోరుకుంటోంది.