డిప్లొమా చేసిన శంకర్ 18 ఏళ్లకే ‘హాల్డా’ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్గా చేరారు. క్రియేటివిటీకి అవకాశం లేకపోవడంతో ఆ ఉద్యోగం మానేశారు. శంకర్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే సినిమాల్లోకి నటుడిగా రావాలనుకున్నారు. మొదట నాటక రంగంలో అడుగుపెట్టి స్క్రిప్టు రాయడంలో, నటనలో అనుభవం సంపాదించారు. రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. అయితే అవి రెండూ ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు నటన వద్దనుకొని దర్శకత్వ విభాగంలో అడుగుపెట్టారు.
శంకర్ తొలుత ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ దగ్గర సహాయ దర్శకుడిగా 17 సినిమాలకు పనిచేశారు. వాటిలో హిందీ సినిమాలూ ఉన్నాయి. తర్వాత స్నేహితుడు పవిత్రన్ దగ్గర రెండు సినిమాలకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేశారు. మరోవైపు దర్శకుడిగా అవకాశాల కోసమూ తిరిగే వారు. ‘మానవ సంబంధాల మీద సినిమా తీయాలని ఒక గ్రామీణ మహిళ ప్రధాన పాత్రలో కథ రాశాను. అందులో రేవతిని కథానాయికగా పెట్టుకోవాలనుకున్నా. ఆ కథ పట్టుకొని ఎంత మంది దగ్గరికి వెళ్లానో నాకే తెలీదు. అలాంటివి వద్దంటూ యాక్షన్ సినిమా కథ ఉంటే చెప్పమనే వారు. దీంతో విసుగొచ్చి ఇక యాక్షన్ సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నా’ అని చెబుతుంటారు శంకర్.
శంకర్‌కు తొలిసారిగా తీసిన సినిమా ‘జెంటిల్ మెన్”. అప్పట్లో ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా నిలిచింది. అప్పటి నుంచి శంకర్ వెనుదిరిగి చూడలేదు. ప్రేమికుడు, జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, ప్రేమిస్తే, శివాజీ, రోబో, స్నేహితుడు, ఐ లాంటి సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేశాడు. ప్రస్తుతం శంకర్ సినిమాల మర్కెట్ రూ. 100 కోట్లపైనే. శంకర్ చివరి సారిగా దర్శకత్వం వహించిన రోబో సినిమా 200 కోట్ల పైచిలుకు వసూళ్లను కొల్లగొట్టింది.
ప్రస్తుతం రజనీ కాంత్, అక్షయ్‌కుమార్‌లతో రోబో -2 మూవీ తీస్తున్నాడు శంకర్. ఆ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. శంకర్ మరిన్ని చిత్రాలను తీస్తూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుంటూ ప్రేక్షకులను రంజింప చేయాలని ఆశిస్తూ Greattelangaana.com తరపున శంకర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.