హ్యాపీ బర్త్ డే.. నభా నటేష్

43
- Advertisement -

ఆకర్షించే గ్లామర్, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ నభా నటేష్. ‘‘నన్ను దోచుకుందువటే‘‘, ‘‘ఇస్మార్ట్ శంకర్‘‘,‘‘సోలో బ్రతుకే సో బెటర్’’, ‘‘డిస్కో రాజా’’, ‘‘అల్లుడు అదుర్స్’’, ‘‘మాస్ట్రో’’ వంటి చిత్రాల్లో విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటించి ఆకట్టుకుంది నభా. సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేస్తుంటుంది. భుజం గాయం కారణంగా సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకుంది నభా నటేష్. త్వరలో ఆమె కొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతోంది. ఇవాళ నభా నటేష్ బర్త్ డే. సోషల్ మీడియాలో నభాకు విశెస్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్. ఆమె మళ్లీ తెలుగు తెరపై సందడి చేయాలని వారంతా కోరుకుంటున్నారు.

Also Read:బొమ్మరిల్లు భాస్కర్…ఎస్వీసీసీ 37

- Advertisement -