భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా,జస్పిత్ బుమ్రాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జడేజా 32వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా ధోని హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ తెలిపారు. పరుగులు చేయడం, వికెట్లు పడగొట్టడం ఆపొద్దంటూ తనదైన శైలీలో విషెస్ తెలిపారు హర్భజన్ సింగ్.
2009 ఫిబ్రవరి 8న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేసిన జడేజా… అదే ఏడాది ఫిబ్రవరీ 10న శ్రీలంకతో తన టీ20 కెరీర్‌ను ప్రారంభం చశాడు. ఇక టెస్టుల విషయానికొస్తే 2012 డిసెంబరు 13న ఇంగ్లాండ్‌తో తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఆడాడు.
భారత పేస్ బౌలింగ్ దిగ్గజం బుమ్రా కూడా ఇవాళ పుట్టినజోరు జరుపుకుంటుండగా ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు. 2016 జనవరి 23న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బుమ్రా… అదే ఏడాది జనవరీ 26న ఆస్ట్రేలియాతో తన టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు.