గంగూలీకి సచిన్, సెహ్వాగ్ స్పెషల్ గిప్ట్

442
Ganguly Sachin
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు నేడు. గంగూలీ 48వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు, క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు. ఈసందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా గంగూలీకి బర్త్ డే విషెస్ తెలిపాడు. సచిన్ ఓ అరుదైన ఫోటొను షేర్ చేసి విష్ చేశాడు.

అండర్ 15జట్టుకు వారిద్దరూ ఆడిన సమయంలోని ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. హ్యాపి బర్త్ డే దాదీ..అండర్ 15 జట్టుకు ఆడే సమయం నుంచి మొదలైన మన ప్రయాణం ఇప్పుడు కామెట్రీ వరకూ కొనసాగుతంది. ఇది నిజంగా గొప్ప ప్రయాణం. ఈ సంవత్సరం కూడా నీకు మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్దిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు సచిన్ టెండూల్కర్.

మరోవైపు మాజీ బ్యాట్స్ మెన్ విరేంద్ర సేహ్వాగ్ కూడా గంగూలీకి విషెస్ తెలియజేశారు. 56 కెప్టెన్ అని డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 56 ఇంచుల ఛాతీ, ఏడో నెలలో 8వ తేదీ 8×7=56 అని, ప్రపంచకప్‌లో 56 సగటుతో బ్యాటింగ్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే దాదా, దేవుడు నిన్ను చల్లగా చూడాలంటూ సెహ్వాగ్ తన కెప్టెన్ గంగూలీకి విషెష్ తెలిపాడు.

- Advertisement -