నేడు హాస్య న‌ట‌ శిఖ‌రం పుట్టినరోజు

23
- Advertisement -

పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం.. అలియాస్ బ్రహ్మీ.. ఏం చెప్పాలి బ్రహ్మీ గురించి. ఎంత అని చెప్పాలి నేటి హాస్య బ్రహ్మ గురించి. ఆయన గాడ్ ఆఫ్ మీమర్స్.. ఆయన కామెడీలో లెజెండ్.. హాస్యానికి చిరునామ అంటూ ఉంటే అది ఆయనే, ద‌శాబ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న హాస్యంతో న‌వ్వుల పువ్వులలో విహరింపచేసిన చరిత్ర బ్రహ్మానందం గారిది. ఎలాంటి పాత్ర అయిన సరే, ఆ పాత్రను బ్రహ్మానందం పోషించగానే దానిలోని అంత‌ర్లీనమైన హాస్యం పొంగిపోర్లుతుంది. బ్రహ్మానందం తెర‌పై క‌నిపించగానే ప్రేక్షకుల మనసులోంచి న‌వ్వు ఉప్పొంగుతుంది.

అందుకే, టాలీవుడ్ లో హాస్యం అంటేనే బ్రహ్మానందం, బ్రహ్మానందం అంటేనే హాస్యం. నేటి తరం ప్రేక్ష‌కుల హృద‌యాల్లో కూడా బలంగా నాటుకుపోయిన హాస్య చక్రవర్తి బ్రహ్మానందం. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి రెండు ముక్కలు తెలుసుకుందాం. బ్రహ్మానందం పంచిన హాస్యసుగంధాలను మరో వందేళ్ళు అయినా ఆనందగా నెమ‌ర‌వేసుకోవచ్చు. బ్రహ్మానందం గారి సినీ ప్రస్థానం నేటి నటీనటులకు ఆదర్శం. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్ర‌ల‌లో నటించి.. తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుని, ఆ తర్వాత ఎన్నో వందల చిత్రాల్లో తన హాస్యంతో నటవిశ్వరూపం చూపించిన లెజండరీ నటుడు ‘బ్రహ్మానందం’.

అలాగ‌ని హాస్యం ఒక్క‌టే బ్రహ్మానందం స్పెషాలిటీ అనుకుంటే పొరపాటే. బ్రహ్మానందం ఎన్నో విలక్షణమైన వైవిధ్యమైన పాత్రలు కూడా చేశారు. బ్రహ్మానందం కృషి, పట్టుదల అమోహం. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన బ్రహ్మానందం, మహా మహా నటుల సరసన సగర్వంగా నిలబడగలిగారు అంటే.. కారణం కేవలం బ్రహ్మానందం మాత్రమే. ఆయనలోని నటన మాత్రమే. బ్రహ్మానందం ప్రేక్షకుడి గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -