హ్యాపీ బర్త్ డే….యాంకర్ సుమ

162
suma
- Advertisement -

తన మాటలతో, విసిరే పంచ్‌లతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుని టాప్‌ యాంకర్‌గా కొనసాగుతున్నారు సుమ. యాంకరింగ్‌కే వన్నె తెచ్చిన సుమను తమ ప్రొగ్రాముల్లో యాంకర్‌గా తీసుకోవడానికి ఎన్నో ఛానెళ్లు ఆసక్తిని చూపుతుంటాయి. యాంకరింగ్‌ ప్రస్థానంలో ఎన్నో ప్రేక్షకాదరణ పొందిన కార్యక్రమాలకు యాంకర్‌ గా చేసిన సుమ తెలుగింటి మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

1974 మార్చి 22న కేరళలో జన్మించారు సుమ. తెలుగునాట పుట్టకపోయినా, తెలుగుభాషపై ఆమె పట్టును చూస్తే ముక్కున వేలేసుకోక మానరు. కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో తొలిసారి సుమ వెండితెరపై నాయికగా కనిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాల్లోనూ ఆమె నటించారు. దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ ను ప్రేమించి పెళ్ళాడారు సుమ. వీరి తనయుడు రోహన్ కూడా తాత,తండ్రి, తల్లి బాటలో నటనలో రాణించాలని చూస్తున్నాడు.

ఇక స్టార్ మహిళగా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే సుమ వేదిక ఎక్కిందంటే చాలు.. కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. తనదైన వాక్చాతుర్యంతో.. సెన్సాఫ్ హ్యూమర్ తో కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తుంది ఈ జయమ్మ. తాజాగా చాలాకాలం తర్వాత సుమ మనసు మళ్ళీ నటనపైకి మళ్ళినట్టుంది. సుమ లీడ్ రోల్‌లో జయమ్మ పంచాయితీ అనే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా ఈ సినిమాతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని greattelangaana.com మరోసారి మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -