హ్యాపీ బర్త్ డే…ఐష్‌

271
aishwarya
- Advertisement -

ఆమె ను చూస్తే చాలు మనసుకు రెక్కలొచ్చేస్తాయి..కవిత్వం పెల్లుబుకుతుంది..ఆమె యూత్ కలల రాణి.. నడిచే తాజ్ మహల్.. ఆమే బాలీవుడ్ నటి ‘ఐశ్వర్య రాయ్’.ఈ పేరు తలిస్తే చాలు.. ప్రపంచంలోని అందమంతా వచ్చి కంటి ముందు సాక్షాత్కరిస్తుంది. ఆమె వెండితెర మీద కాస్తున్న వెన్నెల. బాలీవుడ్ ,టాలీవుడ్, కోలీవుడ్ నుంచి హాలీవుడ్ అంతా ఆమె అందానికి దాసోహమయింది. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రపంచ సినిమాతెరకు పట్టిన తేనెపట్టు ఐశ్వర్యరాయ్. 1996లో మణిరత్నం దర్శకత్వం నటించిన ఇరువర్ అనే తమిళ చిత్రంతో తెరమీద అడుగు పెట్టిన ఐష్..యే దిల్ హే ముష్కిల్ అంటు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన అందాలను ఆరోబోసి కుర్రకారు గుండెలను పిండేసింది. నవంబర్ 1 అందాల గని ఐష్ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

1973 నవంబర్ 1న కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో జన్మించింది ఐశ్వర్యరాయ్. తన ఇరవై ఒకటవ ఏట… అంటే 1994లో ప్రపంచసుందరి కిరీటం దక్కించుకోవడంతో.. రాత్రికి రాత్రి వాల్డ్ ఫేమస్ అయిపోయింది. 1996లో మణిరత్నం దర్శకత్వం నటించిన ఇరువర్ అనే తమిళ చిత్రం ఆమె తొలి తెర అడుగు. అక్కడి నుంచీ ఐష్ కాంత ఐశ్వర్యరాయ్ ఏనాడూ ప్రేక్షకులను మోసం చేసిందే లేదు. అందాలను పంచుతూ… ప్రేక్షకులతో అనుబంధాలను పెంచుకుంటూ వెళ్తూనే వస్తోంది ఇప్పటికి కూడా.

బాలీవుడ్ సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా తన సత్తా చాటింది. రీల్ లైఫ్ వండర్స్ తో పాటూ రియల్ లైఫ్ సన్సేషన్స్ కి కూడా కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ వచ్చింది ఐష్. హమ్ దిల్ దే చుఖే సనమ్ తో కలిసి నటించిన ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలోనే సల్మాన్ ఖాన్ తో లవ్ లో పడింది. కొద్ది రోజులు ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగి హాట్ టాపిగ్గా మారారు. తర్వాత్తరువాత అతనికి గుడ్ బై చెప్పింది.ఆ తరువాత అభిషేక్ బచన్ తో ప్రేమ పెళ్లి పీటలకు చేరుకొని రియల్ లైఫ్ లవ్ స్టొరీ ని సుఖాంతం చేసింది. షారుఖ్ .. అమితాబ్ లతో కలిసి మొహబత్తేన్ లో నటించింది ఐష్.

ఐష్ గురించి..

  • ప్రముఖ అమెరికన్‌ షో ‘ఓప్రా విన్‌ఫ్రే’లో పాల్గొన్న మొదటి సెలబ్రిటీఐశ్వర్య కావడం విశేషం.
  • ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న మొదటి భారతీయ సెలబ్రిటీ కూడా ఐషే.
  • లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఉన్న మొదటి భారతీయ సెలబ్రిటీ మైనపు విగ్రహం ఐష్‌ది.
  • హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌కి జంటగా ‘ట్రాయ్‌’ సినిమాలో ఐష్‌కి అవకాశం వచ్చింది. అప్పటికే చాలా సినిమాలు చేతిలో ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు.
  • అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ భారత్‌ వచ్చినప్పుడు ఐష్‌ని విందుకి ఆహ్వానించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఐష్‌ హాజరు కాలేకపోయారు.
  • ఐష్‌ ముద్దు పేరు ‘గుల్లు’.
  • షూటింగ్‌లో ఐష్‌కి విగ్గు పెట్టుకోవడం అస్సలు నచ్చదు.
  • నెదర్లాండ్స్‌లోని ప్రముఖ క్యూకెన్‌హోఫ్‌ గార్డెన్స్‌లో తులిప్‌ పువ్వులకు ఐష్‌ పేరు పెట్టారు.
  • ఇంట్లో ఎంత మంది పనివారున్నా.. ఐష్‌కి తన చేత్తో వండి ఇంట్లో వారికి వడ్డించడమే ఇష్టం.
  • ఐష్‌ పేరుపై దాదాపు వందల వెబ్‌సైట్లు ఉన్నాయి.

ఐశ్వర్య రాయ్ గురించిన ఏ సమాచారమైనా ప్రచారసాధనాలకు పండగే పండగ. అందాలా అభినయానికి సింబల్ ఎవరూ అని అడిగితే అందరూ తడుముకోకుండా చెప్పేది ఒకే ఒక్క పేరు.. ఐశ్వర్యారాయ్…

- Advertisement -