హ్యాపీ బర్త్ డే….సంగీత

358
sangetha
- Advertisement -

అందంతో పాటు అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన నిన్నటితరం కథానాయికలలో సంగీత ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించిన సంగీత టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగీత పుట్టినరోజు నేడు.

‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే..’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘ఖుషి ఖుషీగా’, ‘సంక్రాంతి’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో అదిరిందయ్య చంద్రం సినిమా చేసిన తర్వాత ఇండస్ట్రికి గుడ్ బై చెప్పింది. సంగీత అసలు పేరు రసిక.కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’లో ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ కుర్రకారు గుండెల్ని పిండేసింది. ఈ సినిమాలో సంగీత నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

ప్రస్తుతం సంగీత సెండ్ ఇన్నింగ్స్ మొదలు పట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తిరిగి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సంగీత. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సంగీతకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. సంగీత తాత కె.ఆర్.బాలన్ సినిమా నిర్మాత. ఆయన 20కి పైగా తమిళ సినిమాలను నిర్మించారు. ఆమె తండ్రి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు.

- Advertisement -