హ్యాపీ బర్త్ డే…శ్రీదేవి

101
- Advertisement -

ఆమె ఒక నటనాతరంగం..భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అందాల జాబిలి. అభిమానుల గుండెల్లో గోదావరిలా ఉప్పొంగింది. పుట్టింది తమిళనాడులో అయిన దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. నాలుగు తరాల స్టార్ హీరోలందరితో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న శ్రీదేవి భూలోకాన్ని విడిచి నేటికి సంవత్సరం కావోస్తుంది. భువి నుండి దివికి వెళ్లినా ఆ అందాల జాబిలి స్మృతులు ఇంకా ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ అతిలోక సుందరిని స్మరించుకుకుంటూ శ్రీదేవి జర్నీ మీకోసం..

1963 ఆగస్ట్ 13న శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో జన్మించారు.బాలనటిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీదేవి…కెరీర్‌లో ఏనాడూ వెనక్కి తిరిగిచూసుకోలేదు. పాత్ర ఏదైనా,సీనియర్ నటుడైనా బెదరలేదు. తన పాత్రకి వందశాతం న్యాయం చేసిన శ్రీదేవి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. ఆమె నటనకు యావత్‌ భారతమే ఫిదా అయిపోయింది.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా భాషల్లో నటించారు. తెలుగులో పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్‌గా అలరించారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించి సుమారు ఐదు దశాబ్దాల పాటు తన నటనతో, మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో వెండితెర జాబిలిగా నిలిచారు.

Also Read:బాలయ్యతో రజనీకాంత్ జస్ట్ మిస్!

ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు, క్రిష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో కలసి నటించింది. 1996లో బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. వీరికి జాన్వి, ఖుషీఅనే ఇద్దరు కుమార్తెలు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో పులి , హిందీలో మామ్ చిత్రాల్లో చివరిసారిగా నటిచింది.

శ్రీదేవి నటనకు ఎన్నో అవార్డులు జాలువారాయి. 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్ కాగా… నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీ లభించాయి. తెలుగులో ఆమె నటించిన క్షణక్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఎమిరేట్ టవర్స్‌లో తీవ్రగుండెనొప్పితో శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Also Read:బన్నీ తర్వాత ఆ గౌరవం సమంతకే

- Advertisement -