హ్యాపీ బర్త్ డే…సోనూ సూద్

86
sonu

విలన్‌గా నటించి నిజ జీవితంలో హీరో అయ్యాడు సోనూసూద్‌. కరోనా లాక్ డౌన్ కాలంలో పేద ప్రజలకు అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. తన దృష్టికి వచ్చిన వారికి సాయం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపి రియల్ హీరో అయ్యారు సోనూ. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు. పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారిన సోనూ బర్త్ డే నేడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం..

పంజాబ్ లోని మోగాలో 1973 జూలై 30న జన్మించిన సోనూ సూద్ ఇంజనీరింగ్ చేశారు. చదువు పూర్తయిన దగ్గర నుంచీ సోనూ సూద్ కు సినిమాలపైనే మనసు మళ్ళింది. ఆ క్రమంలో మోడల్ గా నటించారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగారు. ఆరంభంలో తమిళ చిత్రాలలో నటించారు. నాగార్జున నిర్మించి, నటించిన ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు.

1996లో తెలుగమ్మాయి సోనాలీని పెళ్ళాడారు. వారికి అయాన్, ఇషాంత్ అనే ఇద్దరు అబ్బాయిలు. సోనూ ఆరంభం నుంచీ క్రమశిక్షణకు ప్రాణం ఇచ్చే మనిషి. దేశవ్యాప్తంగా తన దృష్టికి వచ్చిన కష్టజీవులకు కరుణతో సహాయం అందించారు. ఇందుకోసం ‘సూద్ ఛారిటీ’ నెలకొల్పారు. యుపిఎస్సీ పరీక్షలకు వెళ్లాలనుకొనే ఆర్థిక స్తోమత లేనివారికి సరైన శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలా పలు సేవాకార్యక్రమాలు చేస్తూ సాగిపోతున్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, తమిళ చిత్రం ‘తమిళరసన్’లోనూ, హిందీ సినిమా ‘పృథ్వీరాజ్’లో నటిస్తున్నారు. సోనూ మరెన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఇలాగే మెప్పించాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటోంది.