హ్యాపీ బర్త్‌డే… దేశ సేవకే అంకితమైన శిఖా పాండే

48
- Advertisement -

శిఖా పాండే ఈమె పేరు తెలియని వారుండరు. ఎందుకంటే భారత మహిళల క్రికెట్‌ జట్టులో సభ్యత్వం ఉన్న క్రీడాకారిణి. ఈమె మే12,1989 ప్రస్తుతం తెలంగాణలో భాగమైన రామగుండంలో జన్మించారు. కానీ క్రికెట్‌ మాత్రం గోవాలో ప్రారంభమైంది. శిఖా క్రికెట్‌లోనే కాకుండా చదువులో కూడా రాణించి భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్‌ పనిచేస్తున్నారు.

Also Read: అగ్నివీర్‌లకు రైల్వేలో రిజర్వేషన్ సడలింపు..!

మార్చి 9, 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అనతి కాలంలో వన్డే టెస్ట్ మ్యాచ్‌లకు సెలెక్ట్‌ అయ్యింది. 2014 నవంబర్‌26న దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక అద్భుతం  జరిగింది. కేవలం ఒకే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి హఫ్‌ సెంచరీ చేశారు. ఇలా చేసినవారు ప్రపంచంలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు శిఖా పాండే. ఈ మ్యాచ్‌లో 10ఓవర్లు వేసి 19పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. అంతేకాదు 56బంతుల్లో 59పరుగులు చేసి భారత విజయతీరాలకు చెర్చింది. గోవా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారిణీలో శిఖా పాండే ఒకరు. అంతకు ముందు దిలీప్ సర్దేశాయ్, ట్రయల్ బ్లేజర్‌ ఉన్నారు.

Also Read: IPL2023:టీమిండియా భవిష్యత్..” జైస్వాల్ ” విధ్వంసమే !

- Advertisement -