బాలీవుడ్ బాద్‌ షా..బర్త్ డే స్పెషల్

34
- Advertisement -

బాద్‌ షా…ఈ పేరు వింటే గుర్తుకొచ్చేది షారుఖ్ ఖానే. ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తుంటారు..పోతుంటారు కానీ చరిత్ర తిరగరాసే హీరోలు కొంతమందే ఉంటారు. వారిలో ఒకరు షారుఖ్. అసలు హీరోగానే పనికిరాడన్నారు…ఎలానో బాక్సాఫీస్‌కు పరిచయమయ్యారు…కానీ బ్యాట్ టైం ఆయన పనైపోయిందన్నారు..కానీ ఎక్కడైతే తనను అవమానించారో అక్కడే బాద్‌ షాగా అందరి మన్ననలు పొందారు షారుఖ్. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

1965 నవంబర్ 2న జన్మించిన షారుఖ్.. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ కాదు. ఎన్నో కష్టాలు పడ్డారు. పుట్టింది ఢిల్లీలో అయినా సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి వచ్చారు. అవకాశాల కోసం చెప్పుల అరిగేలా తిరిగాడు. టెలివిజన్ ద్వారా కెరీర్ ప్రారంభించిన షారుఖ్.. సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు.

1992లో వచ్చిన దీవానాతో వెండితెరపై మెప్పించారు. 1993 లో వచ్చిన బాజీగర్, డర్ సినిమాల్లో విలన్ గా చేశారు. 1995లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్, కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే ఆయన కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమాతో షారుఖ్ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ బాద్ షాగా మారాడు. దేవదాస్ , డాన్ , చక్ దే ఇండియా ,ఓం శాంతి ఓం, రబ్ నే బనాది జోడి, డాన్ 2, జబ తక్ హై జాన్ వరుస హిట్స్ కొట్టాడు.

Also Read:ఓటీటీలోకి వచ్చేసిన ‘స్కంద’

2013 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సౌత్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేసింది. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -