రాజమౌళి – మహేష్.. ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు

43
- Advertisement -

రాజమౌళి – మహేష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం త్వరలో క్లాప్ కొట్టుకోవడానికి రెడీగా ఉంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి ఎండింగ్ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ లోపు ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి `వీర` అనే టైటిల్ ను దాదాపుగా ఖ‌రారుచేశారని టాక్. అన్నట్టు ఈ సినిమా ఓ సోషియోఫాంట‌సీ క‌థతో సాగుతుందట. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి బోలెడు పుకార్లు వినిపించాయి. ఓ తెలుగు వాడు.. ఆఫ్రికాలో అడుగు పెట్ట‌బోతున్నాడు. అక్క‌డ మ‌నుషులు, వాతావ‌ర‌ణం, చెట్లూ, చేమ‌లూ అన్నీ కొత్త‌గా ఉండ‌బోతున్నాయట.

ఓర‌కంగా చెప్పాలంటే.. మరో బాహుబలి లాంటి క‌థ‌న్న‌మాట‌. బాహుబలి లో కూడా అంతే. రాజమౌళి ఓ కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాడు. మహేష్ సినిమాకి కూడా అలాంటి అవ‌కాశం ఉంది. అందుకే రాజమౌళి గ్రాఫిక్స్ కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. మేకింగ్ లో దాదాపుగా స‌గం బ‌డ్జెట్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ కే స‌రిపోతున్నాని టాక్. ఈ సినిమాలో మరో స్టార్ హీరోని ప్రధాన ప్ర‌తినాయ‌కుడిగా ఎంచుకొనున్నాడు. అయితే అధికారికంగా ప్ర‌క‌టించాల్సివుంది. ఈ సినిమాలో దాదాపుగా అర‌డ‌జ‌ను క‌థానాయిక‌లు ఉండ‌బోతున్నారు. వారి వివ‌రాలూ ఒకొక్క‌టిగా రాజమౌళి రివీల్ చేస్తాడట.

కాగా ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ నినా డోబ్రేవ్ కనిపించనుంది అని చాలా రోజులుగా క్రేజీ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మరి నిజంగానే మహేష్ సినిమాలో నినా డోబ్రేవ్ నటిస్తే.. పాన్ వరల్డ్ సినిమా అయినట్టే. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేయనున్నారని టాక్. ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ను రాజమౌళి సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఐతే, మరో హీరోయిన్ రోల్ కోసం గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను కూడా జక్కన్న అప్రోచ్ అవుతున్నారట. మరి ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారో చూడాలి.

Also Read:పిక్ టాక్ : ముదురు బ్యూటీ అందాల రచ్చ  

- Advertisement -