“గ‌ల్లీ గ‌ల్లీకి..గ‌న్ బ‌జార్”…హ్య‌పీ బ‌ర్త్‌డే టీజ‌ర్‌!

106
happy birthday
- Advertisement -

లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన “హ్య‌పీ బ‌ర్త్‌డే”చిత్రం నుండి చిత్ర‌బృందం తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు. భిన్న క‌థ‌లను ఎంచుకుంటూ త‌న క్యూట్ అభిన‌యంతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క‌థానాయిక లావ‌ణ్య త్రిపాఠి. “మ‌త్తు వద‌ల‌రా” వంటి బ్ల‌క్ బ‌స్ట‌ర్ సినిమాను తెర‌కెక్కించిన రితేష్ రానా “హ్య‌పీ బ‌ర్త్‌డే” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసారు.

ఈ టీజ‌ర్‌ “ఆయుధాల చ‌ట్టం అంటే ఏంటి సుయోధ‌న‌.. ఇంటింటికి గ‌న్, ఎదురులేని ఫ‌న్” అంటూ మొద‌లవుతుంది. “నేను టెన్త్ ఫేయిల్ అయ్యుండోచ్చు కానీ.. గ‌న్‌బిల్ మాత్రం పాస్ చేసే తీరుతా” అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్,”దేశం న‌లుమూల‌లా అంబ‌రాన్నంటిన సంబురాలు, గ‌ల్లీ గ‌ల్లీకి ఏర్ప‌డిన గ‌న్ బ‌జార్ అంటూ” వ‌చ్చే న్యూస్ కామెంట్స్ సినిమాపై ఇన్ట్రెస్ట్ ని పెంచుతున్నాయి. మధ్య మధ్య లో వచ్చే “హ్య‌పీ బ‌ర్త్‌డే టు యూ..హ్య‌పీ హ్య‌పీ బ‌ర్త్‌డే” థీమ్ మ్యూజిక్ సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది. చివ‌ర్లో “అస‌లు మీకు ఈ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది అని వెన్నెల కిషోర్‌ను అడుగుతుంటే.. నాకు ఈ ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది అనే అడిగే బ‌దులు.. మీకెందుకు రాలేద‌ని సిగ్గుప‌డండి” అంటూ కిషోర్ ప‌లికే సంభాష‌ణ‌ హాస్యాస్పదంగా ఉంటాయి.

ఈ చిత్రం లో వివేక్ అగ‌స్త్య‌ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సురేష్ స‌రంగం కెమెరా విజువ‌ల్స్ ,కాల భైర‌వ నేపథ్య సంగీతం ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, క్లాప్ ఎంట‌ర్టైన‌మెంట్స్ సంస్థ‌లు నిర్మించాయి. టీజ‌ర్‌ను చూస్తే ఫుల్ అవుట్ ఫుల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా సినిమా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూలై 15న విడుద‌ల కానుందని సమాచారం.

- Advertisement -