హ్యాపీ బర్త్ డే ప్రిన్స్ మహేష్..

629
mahesh birthday
- Advertisement -

ఆ పేరులోనే ఎదో మాయ ఉంది.. స్టైల్‌ ఉంది.. వైబ్రేషన్స్‌ ఉన్నాయ్.. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు.ఆయనే ప్రిన్స్ మహేష్ బాబు. నేడు మహేష్ బర్త్ డే సందర్భంగా గ్రేట్ తెలంగాణ ప్రత్యేక కథనం.

తండ్రి కృష్ణ నటవారసత్వంతో చిన్నప్పుడే నీడ చిత్రంతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశారు. అక్కడినుండి పలు చిత్రాల్లో నటించి చిన్న వయసులోనే అందరిని మెప్పించిన మహేష్ బాబు, తొలి చిత్రం రాజకుమారుడు సూపర్ హిట్ కావడంతో మహేష్ కి మొదటి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

Happy Birthday Mahesh Babu

 రాజకుమారుడు తర్వాత  మహేష్ లోని అద్భుత నటుడిని పరిచయం చేసిన మూవీ ‘మురారి’.   ఆ తరువాత ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను. ఇలా కెరీర్ లో సూపర్ హిట్స్ తో తన తండ్రి కృష్ణ లానే ఎంతో శ్రమించి సూపర్ స్టార్ స్టేటస్ ని  పొందారు మహేష్.

Happy Birthday Mahesh Babu

సినిమా సినిమాకు తనను మరింత సానబెట్టుకుంటూ ప్రయోగాత్మక కథలతోనే అటు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే బాక్సాఫీసును షేక్ చేయడం మహేష్ నైజం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటూ వివాదాలకు దూరంగా ఉండే మహేష్‌బాబు అంటే అందరికీ ఎంతో అభిమానం. ఇటీవలే మహర్షిగా ప్రేక్షకులను పలకరించిన మహేష్ తన 44వ పుట్టినరోజు కానుకగా సరిలేరు నీకెవ్వరూ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. మహేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -