హ్యాపీ బర్త్ డే..రాఘవేంద్రరావు

65
- Advertisement -

తెలుగు చిత్రాలను కమర్షియల్ బాట పట్టించిన దర్శకుడు ఆయన, సినీ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైనా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు. వందకు పైగా చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ సాధించిన దర్శకేంద్రుడు.ఆయనే రాఘవేంద్రరావు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

రాఘవేంద్రరావు మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో సుర్యప్రకాశ రావు దంపతులకు జన్మించాడు. రాఘవేంద్రరావు తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశరావు దర్శకుడే. కమలాకర కామేశ్వరరావు దగ్గర కొన్నాళ్ళు సహాయకుడిగా పనిచేశాడు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు.

Also Read:శ్రీధర్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలి!

5 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో తిరుగులేని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్రరావు..ఎనిమిది నంది పురస్కారాలు, ఒక IIFA పురస్కారం, ఒక సైమా అవార్డు,ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, రెండు సార్లు సినీ మా (Cinemaa) అవార్డులు అందుకున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ను వెండి తెరకు పరిచయం చేసింది రాఘవేంద్రరావే.

ఆయన తెరకెక్కింయిన అడవిరాముడు,జగదేక వీరుడు అతిలోక సుందరి,పెళ్లిసందడి ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్‌ సినిమాలు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు భక్తి సినిమాలకు కేరాఫ్‌గా మారారు. అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి వంటి భక్తి రసాత్మక చిత్రాలు అందరినీ అలరించాయి. రాఘవేంద్ర రావు సినిమా అంటే పూలు పళ్లు తప్పకుండా ఉండాల్సిందే.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -