తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న సంగీత దర్శకుడు M.M. కీరవాణి. జూలై 4, 1961 లో జన్మించారు. 1990లో విడుదలైన ‘మనసు మమత’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కించుకున్నారు. అయితే, ఆయన సినీ జర్నీ అంత ఈజీగా ఏమీ సాగలేదు. ఎన్నో కష్టాలు బాధ్యతల మధ్యన కీరవాణి ప్రస్థానం సాగింది.
నిజానికి‘మనసు మమత’తో వెండితెరకు సంగీత దర్శకుడిగా పరిచయమైనా కీరవాణికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ కీరవాణికి సరైన విలువ ఉండేది కాదు. ఆ సమయంలోనే కీరవాణికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అవకాశం ఇచ్చాడు. ఒకవిధంగా కీరవాణి కెరీర్ వేగాన్ని పెంచింది కూడా ‘క్షణక్షణం’ సినిమానే. ఆ సినిమా విజయం సాధించడంతో భారీ చిత్రాల ఆఫర్లు వరుస కట్టాయి.
Also Read:పొద్దుతిరుగుడుతో ఈ సమస్యలు దూరం..
ఆ సినిమా తర్వాత ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి మొగుడు’, ‘ఆపద్బాంధవుడు’ సినిమాలకు కీరవాణి అవకాశం వచ్చింది. ‘క్రిమినల్’లోని ‘తెలుసా మనసా’ పాట బాలీవుడ్‌లో కూడా బాగా పాపులర్ అయ్యింది. దాంతో కీరవాణి పేరు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగింది. ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. ఓ దశలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి చలామణి అయ్యారు. తన తియ్యని బాణీలతో మన అందరినీ అలరిస్తున్న కీరవాణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Also Read:పిక్ టాక్ : భారీ పరువాల గమగుమలు