Karan Johar:బర్త్ డే స్పెషల్

63
- Advertisement -

కరణ్ జోహార్…పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ అగ్ర నిర్మాతగా వ్యాఖ్యతగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు కరణ్. బాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా అంతకంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు కరణ్. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

1972 మే 25న ముంబైలో జన్మించారు కరణ్. ఆయన తండ్రి యశ్‌ జోహార్ బాలీవుడ్ నిర్మాత. ధర్మ ప్రొడక్షన్స్‌ ఫౌండర్. బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన యువ చిత్రనిర్మాతలలో ఒకరు. అందరు ముద్దుగా కే.జో అని పిలుసుచుకునే కరణ్ జోహార్ నిర్మాత మాత్రమే కాదు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా.

చిన్నప్పటి నుంచి సినిమాలకు ఆకర్షితుడైన కరణ్.. 90ల లోనే కుచ్ కుచ్ హోతాహై సినిమాలో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి మంచి సక్సెస్ సాధించి ఎంతోమంది అభిమానులను పొందాడు. తనదైన నటనతో ఎంతో మందిని ఆకర్శించిన కరణ్ జోహార్ క్రమంగా నటన నుంచి ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు.

Also Read:9 సంవత్సరాలు..68 దేశాలు

సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన కరణ్ జోహార్ లెక్కకు మించిన జాతీయ ఫిలింఅవార్డులు, ఫిలింపేర్ అవార్డులు వంటివి మాత్రమే కాకుండా భారతదేశపు అత్యున్నత పురస్కారం పద్మశ్రీ (2020లో) సొంతం చేసుకున్నారు. కరణ్ జోహార్ 250 గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాలో ఒకరుగా నిలిచారు. సినిమాలు మాత్రమే కాదు ఆటోమొబైల్స్ మీద మక్కువ ఎక్కువ. అందుకే ఖరీదైన లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నారు. ఇక కరణ్ హోస్ట్‌గా కాఫీ విత్ కరణ్ షో అత్యంత ప్రజాదారణ పొందిన షోల్లో ఒకటి. తనదైన హోస్టింగ్‌తో పాటు కాంట్రవర్సీతో ఇప్పటికి టాప్ రేటింగ్‌లలో ఉంది.

Also Read:క్వాలిఫయర్‌-2లో ముంబై గెలుపు

- Advertisement -