పుట్టినరోజు జరుపుకుంటున్న నేటి సినీ ప్రముఖులు

115
- Advertisement -

తెలుగు వెండితెరపై వెలుగిపోతున్న ముగ్గురు పుట్టినరోజు నేడు. లోకనాయకుడు కమల్ హాసన్‌ నేడు (నవంబర్‌ 7) 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అంతేకాకుండా నటుడిగా 65 వసంతాలు పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ల వయసులోనే బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కమలహాసన్‌ చేసిన ప్రయోగాలు బహుశా ఏ నటుడు చేసి ఉండరు. ఆయన ప్రస్తుతం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో 233వ చిత్రంతో పాటు, మణిరత్నం దర్శకత్వంలో 234వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

మరో ప్రముఖ వ్యక్తి విషయానికి వస్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ముద్దుగా ఇండస్ట్రీలో పిలుచుకునే పేరు గురూజీ. ర‌చ‌యిత‌గా కెరీర్‌ ఆరంభించి ద‌ర్శ‌కుడిగా ఉన్న‌త స్థానాన్ని అధిరోహించారు. సాధారణ మనిషి జీవితాన్ని వెండితెరపై గ్రాండ్‌గా ఆవిష్కరించే త్రివిక్రమ్‌ రైటర్‌గా రచయితలకు ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చారనే చెప్పాలి. టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ మంచి విజ‌యాలు అందుకుంటున్న త్రివిక్ర‌మ్ కు హ్యాపీ బర్త్ డే.

Also Read:జుట్టు రాలిపోతోందా..ఈ చిట్కాలు మీకోసమే!

అలాగే మరో తార విషయానికి వస్తే.. ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన హీరోయిన్ అనుష్క శెట్టి. హీరోల‌కు స‌మానంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె న‌టించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద తిరుగులేని విజ‌యాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఈరోజు ఈ అందాల రాశి పుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే జేజమ్మ.

- Advertisement -