పుట్టినరోజు శుభాకాంక్షలు గౌతమ్‌గంభీర్‌

227
- Advertisement -

క్రికెట్‌ దిగ్గజాలైన సెహ్వాగ్‌, సచిన్‌ ఔట్‌ అయినా తన దైన శైలిలో ధోనితో కలిసి ఒక ఆద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చిన వీరుడు ఎవరో తెలుసా… ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా… 2011నాటి ప్రపంచ కప్‌ ముంబైలో ఫైనల్స్‌  జరుగుతున్నప్పుడు ఓపెనర్‌ ఒక్కడే శ్రీలంకకు ఎదురునిలిచి సెంచరీ మిస్‌…కానీ కప్‌ మనదే. అతను ఎవరో కాదు… గౌతమ్‌ గంభీర్‌…భారత క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం.

రెండు మెగా టోర్నీల్లో…గంభీర్‌ వల్లే టీమిండియా విజేతగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌ అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన గంభీర్.. 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా గంభీర్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రముఖుల విషెష్‌
242 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు, 10324 ఇంటర్నేషనల్‌ రన్స్‌.. 2007 వరల్డ్‌ టీ20, 2011 వరల్డ్‌ కప్‌ విన్నర్‌ గౌతమ్‌ గంభీర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ అటు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. పుట్టిన రోజు సందర్భంగా గౌతమ్‌ గంభీర్‌కు మంచే జరగాలని కోరుకుంటున్నాని సురేశ్‌రైనా ట్వీట్‌ చేశారు. నిజమైన స్నేహితుడు, గొప్ప మనిషి… హ్యాపీ బర్త్‌డే బ్రదర్” అని రైనా ట్వీట్ చేశాడు.

ప్రియమైన సోదరుడు గౌతమ్‌ గంభీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాడు. ప్రతీ అంశంలో గంభీర్ ఛాంపియన్ అని కొనియాడాడు. త్వరలోనే నిన్ను కలవాలని అనుకుంటున్నాను” అని యువీ ట్వీట్ చేశాడు. గంభీర్కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని..విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో పేర్కొంది.

గంభీర్దే కీలకపాత్ర..
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్లలో టీమిండియా విజయంలో గంభీర్ ది కీలక పాత్ర. రెండు ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్ తరపున గంభీర్ అత్యధిక స్కోరు చేశాడు. 2007 వరల్డ్ కప్ ఫైనల్లో 75 పరుగులు చేస్తే..2011 ఫైనల్లో 97 రన్స్ కొట్టాడు. రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ విజయాల్లో గంభీరే అత్యధిక స్కోరు సాధించినా ..కూడా అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు మాత్రం దక్కలేదు. అద్భుతంగా ఆడినా కూడా రావాల్సినంత పేరు మాత్రం రాలేదు.

- Advertisement -