హ్యాపీ బర్త్ డే…దిశా పటానీ

397
disha patani
- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ.అయితే తొలి సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసిన దిశా…ప్రస్తుతం బీ టౌన్‌లో హాట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

చేతినిండా సినిమాలు ఉన్నా అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకడుగు వేయదు దిశా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తోంది ఈ అమ్మడు. ఇక ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ విషెస్ చెబుతున్నారు.

ఎంఎస్ ధోనీ: అన్‌టోల్డ్ స్టోరీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా… వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. సల్మాన్‌తో భారత్‌ సినిమాలో నటించిన దిశా నటించిన చిత్రం మలాంగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. నటుడు టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారని సైతం ప్రచారం జరుగుతోంది. కానీ వీరు మాత్రం నోరు మెదపడం లేదు. మొత్తంగా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న దిశా మరెన్నో చిత్రాల్లో నటించి మెప్పించాలని గ్రేట్ తెలంగాణ.కామ్ మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -