Jr NTR:హ్యాపీ బర్త్ డే…దేవర

19
- Advertisement -

ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలే తెలుగు సినిమా, తెలుగు సినిమాయే ఈ మూడు అక్షరాలు. నందమూరి తారక రామారావు… ఈ పేరు వినగానే తెలుగువాడి గుండె ఆత్మగౌరవంతో ఉప్పొంగుతుంది, తెలుగు ఆడియన్స్ హృదయాలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతాయి , అటువంటి మహనీయుడి పేరుతో పాటు రూపాన్నీ పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనుమడిగా పేరు తెచ్చుకున్నారు. తాత ఎన్టీఆర్ ని, బాబాయ్ యువరత్న బాలకృష్ణ ని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన మార్క్ తెలుగువారి హృదయాల్లో వేశారు. ఇవాళ యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్బంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

బాలరాముడిగా మెప్పించిన బాల తారకరాముడు.. స్టూడెంట్ నెం.1గా ఆపై సింహద్రిగా, యమదొంగలా, తెలుగింటి ఆడపడుచులకు రాఖిలా, వైవిద్యమైన క్యారెక్టర్లతో ఊసరవెల్లిగా మారి తెలుగు బాక్సాపీస్‌ రూలర్ గా దమ్ము చూపించిన ఆది ఎన్టీఆర్‌కే చెల్లింది. అనతికాలంలోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరిపోయాడు జూనియర్‌. నందమూరి నట వంశంలో ఈ మూడో తరం హీరోకు లభించిన క్రేజ్‌ మరే హీరోకు దక్కలేదు.

2001లో ‘నిన్ను చూడాలని’ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఏ నటుడికైనా కెరీర్లో హిట్లు, ప్లాపులు సహజం…. అయితే ప్లాపుల కారణంగా పడిపోయిన ప్రతిసారి ఉవ్వెత్తున లేస్తూ తన సత్తా చాటుతున్నాడు ఎన్టీఆర్. రాజమౌళి డైరక్షన్లో సింహాద్రి అంటూ ఒక్కసారిగా అగ్రస్థానానికి చేరువై అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్లు అన్నీ తిరగ రాశాడు.మాటల్లో పవర్ ఉంది , చేష్టల్లో ఎనర్జీ ఉంది , డాన్సు లో ఊపు ఉంది నటనలో పదును ఉంది టోటల్ గా ఎన్టీఆర్ అంటే పర్ఫెక్ట్ స్టార్, ఎన్టీఆర్ ఎలాంటి కారెక్టర్ అయినా అధ్బుతం గా చేయగల హీరో. సినిమా, సినిమాకీ ఎదుగుతూ తన పరిధిని పెంచుకుంటూ వెళ్తున్నాడు ఎన్టీఆర్. స్వశక్తితో ఎదుగుతున్న ఎన్టీఆర్ ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేసేందుకు శ్రమిస్తారు. తాత నందమూరి తారక రామారావు, బాబాయి బాలక్రిష్ణ బాటలోనే జైలవకుశతో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు తారక్.

ఆర్ఆర్ఆర్ తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్…మరో పాన్ ఇండియా మూవీ దేవరతో అలరించేందుకు అక్టోబర్ 10న వస్తున్నారు. అలాగే తన కెరీర్‌లో తొలి బాలీవుడ్ చిత్రం వార్‌ 2పై భారీ ఆశలు పెట్టుకున్నారు తారక్. ఇలానే వెండితెరపై ఆనందాల అల్లరి చేస్తూ, సంతోషాల సందడి చేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనీ, మరెన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ. కామ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Also Read:కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్..

- Advertisement -