- Advertisement -
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే డాడీ.. అని ఆమె తన ట్విట్టర్ ద్వారా విషెస్ అందించారు. ప్రతి రోజు మీ నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటాను. మీరు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు కవిత ట్వీట్ చేశారు.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా కవిత బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ హోమం నిర్వహించారు.
- Advertisement -