హ్యాపీ బర్త్ డే..ఛార్మి

38
- Advertisement -

14 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఛార్మి. తొలుత తమిళ ఇండస్ట్రీతో వెండితెరకు పరిచయమైన ఛార్మి తర్వాత తెలుగులో ఒక వెలుగు వెలిగింది. హీరోయిన్‌గా నిర్మాతగా మారి మంచి ఇమేజ్‌ని సంపాదించుకుంది. ఇవాళ ఛార్మి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

అది 2001వ సంవత్సరం. అప్పటికి ఛార్మి వయస్సు 14. ఆమెను చూసిన ఇండస్ట్రీలోని వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడు కావాలి సినిమాలో నటించే అవకాశం కల్పించాడు. అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు. తర్వాత తమిళ చిత్రం కాదల్ కిసు కిసులో నటించగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీంతో తన కెరీర్‌లో వెనుదిరిగి చూడలేదు ఛార్మి. కృష్ణవంశీ శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మికి మళ్లీ తెలుగులో అవకాశం కల్పించాడు. అందులో ఛార్మి నటనకు మంచి మార్కులు పడగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

Also Read:ఈ ఆసనం వేస్తే ఆ సమస్యలు దూరం!

పంజాబీ అమ్మాయి అయిన అచ్చ తెలుగమ్మాయిల ఉండటంతో వరుస అవకాశాలు వెతక్కుంటు వచ్చాయి. అనతికాలంలోనే అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. ఇక 2007 డిసెంబరులో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే తర్వాత వరుస ఫ్లాప్‌లు, వెండితెరకు మరకలాంటి డ్రగ్స్ కేసులో ఈ బ్యూటీ ఉండటం ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారాయి.

దీంతో నటనకు పుల్ స్టాప్ పెట్టి పూరి జగన్నాథ్‌తో కలిసి నిర్మాతగా మారారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో రోగ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, లైగర్ సినిమాలు నిర్మించింది. ప్రస్తుతం హీరో రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సినిమాను నిర్మిస్తోంది.

Also Read:జీడిపప్పు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన ఛార్మి నటించింది. అటు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ప్రత్యేక పాటల్లో హీరోలతో స్టెప్పులు వేసింది. వెండితెర నటనకు దూరమైనా ఆమె ఇలాగే మంచి సినిమాలను నిర్మించాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -