సహాయనటుడిగా, కథానాయకుడిగా,హాస్యనటుడిగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు చంద్రమోహన్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు. ఇవాళ ఆయన పుట్టినరోజు.
కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు చంద్రమోహన్. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.హీరోగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించారు.
Also Read:రూ.2వేల నోటు..ఆర్బీఐ మరో కీలక ప్రకటన
క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరో చంద్రమోహన్ . సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన నటించిన సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి ఇప్పటికి ఎప్పటికి ఎవర్‌గ్రీన్ చిత్రాలే. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి వారితో నటించారు.
Also Read:హ్యాపీ బర్త్ డే..రాఘవేంద్రరావు
2005లో అతనొక్కడే సినిమాలో నటనకు గాను ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు. 2021లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందారు.