హ్యపీ బర్త్ డే అనుష్క..

1107
anuska shetty
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో అసలు కథానాయిక అంటే గ్లామర్ పాత్రల్లో మెరిసే ఓ బొమ్మ అన్న ఆలోచన మాత్రమే ఉంది. అలాంటి సమయంలో ఆ ఆలోచనను పటాపంచల్ చేసి కథానాయికకి సరైన నిర్వచనం చెప్పింది అనుష్క శెట్టి. ఓ అరుంధతి, ఓ సరోజా, ఓ దేవసేన, ఓ రుద్రమదేవీ ఇలా పాత్ర ఏదైనా పరాకాయ ప్రవేశం చేసి అందులో లీనమైపోయి జీవించేసింది. తన అందం.. అభినయంతో తోటి కథానాయికలకు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇవాళ స్వీటి పుట్టినరోజు  సందర్భంగా  greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Happy Birthday Anushka Shetty

1981 నవంబర్ 7 న బెంగళూర్ లో జన్మించింది అనుష్క శెట్టి. యోగా టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సూపర్(2005) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆపై తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించే చాన్స్ కొట్టేసింది. తన సినీ జీవితంలో మొత్తం పదేళ్లలో దక్షిణాది భాషల్లో 39 సినిమాల్లో నటించింది. మెగాస్టార్‌ చిరంజీవితో కూడా స్టాలిన్‌లో ఆడిపాడింది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో ‘లింగ’లో నటించింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

Happy Birthday Anushka Shetty

అయితే 2009లో కొడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి ఆమె కెరీర్ ను మలుపు తప్పింది. జేజెమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది అనుష్క. లేడీ ఓరియెంటల్ సినిమాలకు ఆస్కారం లేదని విమర్శలు వస్తున్న సమయంలో అరుంధతి ప్రభంజనం గట్టి జవాబుగా నిలిచింది. ఈ చిత్రం ఆమెకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ‘బిల్లా’ తర్వాత ‘వేదం’లో సరోజ పాత్రలో ఒదిగిపోయింది. ఈమె నటనకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు కూడా లభించింది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో ‘పంచాక్షరి’గా మెప్పించాలనుకున్నా ఫలించలేదు. మహేష్‌బాబుతో ‘ఖలేజా’ చేసింది. తమిళంలో సూర్యతో ‘సింగం’, ‘సింగం 2’ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ‘మిర్చి’ ‘బాహుబలి’ చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలిలో దేవసేన పాత్రలో డీగ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది.

Happy Birthday Anushka Shetty

భారీ బడ్జెట్‌తో గుణశేఖర్‌ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’గా కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం కోసం ఏకంగా రెండున్నర ఏళ్లు శ్రమించింది. ‘సైజ్‌ జీరో’ చిత్రం కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరిగి తగ్గింది అనుష్క. ‘బాహుబలి 2’లో మళ్లీ దేవసేన పాత్ర కోసం బరువు తగ్గాల్సి వచ్చింది స్వీటికి. బహుశా సినిమాల కోసం ఇంతగా కష్టపడే హీరోయిన్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చూసి ఉండకపోవచ్చు.
Happy Birthday Anushka Shetty

ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరిన్నీ జరుపుకోవాలని, మరిన్ని చిత్రాలను మనకు అందించాలని మనసారా కోరుకుంటూ.. గ్రేట్ తెలంగాణ(greattelangaana.com ) తరపున అనుష్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

- Advertisement -