హ్యాపీ బర్త్ డే…అంజలి

514
anjali birthday
- Advertisement -

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్ సినిమాలు ఇటు హారర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఎంటర్టైన్ చేసిన అందాల తార అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇవాళ అంజలి బర్త్ డే.

2006లో ‘ఫొటో’ సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది అంజలి. 2007లో ‘ప్రేమలేఖ రాశా’.. సినిమా చేసిన అంజలి.. తర్వాత ‘షాపింగ్‌మాల్’ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ ‘జర్నీ’లో అవకాశం ఇచ్చారు.

2011లో విడుదలైన ‘జర్నీ’ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. ఇక 2013లో మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.

జర్నీ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ‘సౌత్ ఫిల్మ్‌ఫేర్-2012’, ‘విజయ్’ అవార్డులు సొంతం చేసుకుంది. హీరోయిన్ కాకముందు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసిన అంజలి..షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది.

అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సైలెన్స్ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటించింది. తన చెరగని చిరునవ్వుతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అంజలి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -