Adhah Sharma:బర్త్‌డే స్పెషల్

87
- Advertisement -

అదా శర్మ..కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన బ్యూటీ. 1920 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో అదా నటనతో పాటు అందాల ప్రదర్శనతో కుర్రకారు మతిపొగొట్టిది. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

అదా కేరళలోని పాలక్కాడ్ లోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కా ఆమె తండ్రి నావికాదళంలో కెప్టెన్ గా పనిచేశారు. ఆమె తల్లి పాలక్కాడ్ కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారిణి. చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాదు ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తరువాత ఆమె హిందీలోనే హసే తో పసే (2014) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

Also Read:చర్మ సమస్యలకు ఇంటి వైద్యం..

తెలుగులో హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం (సినిమా) సినిమాలు విజయం సాధించాయి. ఆమె 2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం. రీసెంట్ గా ద కేరళ స్టోరీ చిత్రంలో నటించింది అదా.

Also Read:పెసరట్టు – ఉప్మా…చరిత్ర

ఇక ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోషూట్‌తో హీట్ పెంచేస్తున్న ఈ బ్యూటీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరోసారి బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది greattelangaana.com

- Advertisement -