మళ్లీ ఒక బాపు ఉద్భవిస్తాడనుకోలేదు.. జయహో కేసీఆర్

1099
kcr
- Advertisement -

ముందుగా…తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి గ్రేట్ తెలంగాణ టీవీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
మీ గురించి ఎంత పొగిడినా అది పొగడ్త అనిపించుకోదు.. ఎంత కచ్చితత్వం..మీ పనిలో..మీ మాటలో.. మీ చేతలో..ఎలా సాధ్యం ఈ అద్భుతం..మీడియా అంతా వ్యతిరేకం..ప్రభుత్వం వ్యతిరేకం..తెలంగాణ అనే పదం నిషేదం..తెలంగాణ పేరెత్తితే అరెస్టులు..వార్నింగులు.ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను స్థాపించి ఒక్క చుక్క రక్తం నేల రాలకుండా..ప్రత్యర్థులపై ద్వేషం కలగకుండా…ప్రపంచమంతా పాఠ్యాంశంగా చదువుకోదగ్గ స్థాయిలో ఉద్యమం చేయడం ఎలా సాధ్యమైంది మీకు..??

తెలంగాణ కల సాకారమై ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆశ్చర్యమే నాకు..మీ మీద జరగని దాడి లేదు.. మీపైన చేయని కుట్ర లేదు..చుట్టూ ఉన్నవాళ్లను కొనేసినా.. అల్పులు కొందరు అమ్ముడుపోయినా మొక్కవోని ఆ దీక్షాదక్షత ఎలా సాధ్యమైంది మీకు..అరవై ఏళ్ల అరుపెరగని పోరాటం..వేల మంది బలి దానాలు..చెన్నారెడ్డి లాంటి మేరునగధీరుడి పరాజయాలు..అనుమానాలు..అవమానాలు అయినా దడవుక..విడువక..పుష్కర కాలంలోనే పట్టుకొస్తివి కదా… మీకు ఇసుమంత కూడా భయమేయలేదా…ఓడిపోతే ఏంటి పరిస్థితి అని..? ..తోములు..తురుములు చేస్తేనే కాని పని ఈ బక్కపలుచటాయన చేస్తడా…తెలంగాణ తెస్తడా…అంటూ అవహేళన చేసినా… 11 రోజుల పాటు ఆమరణ నిరాహర దీక్ష చూసి..చావు నోట్లో తలపెట్టి ఆ బక్క ప్రాణాన్ని బలిపెట్టాలని చూశారే… మీకేం భయం వేయలేదా … ఏం కావాలి మీకు..? ఎందుకు ఇంతటి మొండితనం..

స్వరాష్ట్రం తెచ్చుకున్నా.. ఇక పరాయి పాలకులే పెత్తనం చేస్తున్న నేల మీద…ఎన్నికల రణ క్షేత్రాన్ని ఒంటి చేత్తో ఈది 63 స్థానాలతో విజయ కేతనం ఎగరవేశారు..క్యాడర్ లేదు..బూత్ స్థాయి నాయకులు లేరు..లీడర్లు లేరు..అంతా ఉద్యమకారులే.. నిన్నమొన్నటి దాకా జై తెలంగాణ అంటూ వీధి పోరాటాలు చేసినవారే.. వారిని వెంటేసుకుని తెలంగాణ గడ్డ మీద తొలి స్వంతంత్ర పాలన తెచ్చావు ..బాపూ నీకెక్కడిది ఇంత శక్తి.. ఢిల్లీకి గులాములు కానివ్వకుండా..పక్క రాష్ట్రం వాళ్ల చేతుల్లో పడనివ్వకుండా ఈ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడిన నీ ఘనతను ఎలా పొగడాలి..ఈ దేశానికి స్వాంతంత్ర్యం ఇచ్చిన మహాత్మా గాంధీకంటే నువ్వేం తక్కువ..నీకేం తక్కువ…

 kcr

సమైఖ్య రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ 60 వేల కోట్లయితే తెలంగాణకు కేటాయించేది 10 వేలకోట్లు..అలాంటి ప్రాంతానికి..ఒక్కసారిగా లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చి తెలంగాణను మొదటి ఐదేళ్లలోనే దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపేంతటి శక్తుయుక్తులు ఎలా వచ్చాయి..మీరు కూడా మామూలు రాజకీయ నాయకులేగా…?? మరెలా సాధ్యమైంది ఈ పరమపద సోపానంలాంటి రాజకీయ యవనిక మీద..ఇంతటి ప్రణాళికాయుతమైన అభివృద్ధి.. ఇంతటి కచ్చితమైనా పాలనాదక్షత..

నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను సశ్య శ్యామలం చేయాలని సంకల్పించి 80 వేల కోట్లతో కాళేశ్వరం బహుళార్థక ప్రాజెక్టు, సీతారామసాగర్, మల్లన్న సాగర్, మిషన్ కాకతీయ,..మిషన్ భగీరథ..లాంటి ఎన్నో భృహత్తర కార్యక్రమాల్ని, ప్రాజెక్టుల్ని చేపట్టి తెలంగాణను సశ్యశ్యామలం చేస్తున్నావు..60 ఏళ్లు ప్రయత్నం చేసినా కాని పనుల్ని 5 ఏళ్లలో ఎలా చేయగలిగారు మీరు..? మీదగ్గర మంత్రదండం ఉందా..? మీకేమైనా మ్యాజిక్కులు వచ్చా..??ఎడారిలాంటి తెలంగాణ ఐదేళ్లలో ఆకుపచ్చ ఉద్యానవనంగా మారిపోయిందే ఈ ఘనతను ఎలా వర్ణించేంది..?

కరెంటు అడిగితే సమైఖ్య పాలకులు కాల్చిచంపారు..అలాంటి చోటనే..అదీ కొత్త రాష్ట్రంలో.. కేవలం మీ ప్రణాళికాబద్ధమైన కృషితో..మీ అకుంఠిత దీక్షతో కంటిరెప్పపాటు కూడా ఈ రాష్ట్రంలో కరెంటు పోనివ్వకుండా..చేశావు..బాపూ నిజం చెప్పు..నీకెలా సాధ్యమిది.??

అభివృద్ధి కార్యక్రమాల గురించైతే మాట్లాడటానికే నోరు పెగలడం లేదు..ఎన్ని పథకాలు..ప్రతీ ఇంటికీ..ప్రతీ మనిషికీ..చేరేలా..దళారీలు లేరు..మధ్యవర్తులు లేరు..లంచాలు లేవు.. రైతు బంధు..రైతు భీమా.. కళ్యాణ లక్ష్మి..షాదీ ముబారక్..ఆసరా ఫించన్లు..కేసీఆర్ కిట్..కంటి వెలుగు..జన జీవితంలో కోటి కాంతులు నింపుతున్నావు..ఇంతటి నిబద్ధత నిజాయితీ ఎందుకు బాపూ.. నీ రుణం ఎప్పటికి తీర్చుకునేది మేం..

తెలంగాణ తెచ్చిన ఊపులో కష్టంగా 63 సీట్లు వచ్చాయి.. ఇక రెండో సారి ఆయన గెలిచేది కూడా కష్టం అంటూ పచ్చ మీడియా పచ్చిగా బూతులు కక్కుతున్నా..ముందస్తుకు వెళ్లి గెలిచిన వాళ్లు లేరు..అయిపోయాడు కేసీఆర్ అంటూ గేలి చేసినా…సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇస్తా అంటూ మూడు నెలల ముందే ప్రకటించినా…నీ మీద అక్కసుతో ఆంధ్రాను అరువుతెచ్చుకుని కాంగ్రెస్ వందల కోట్లు కుమ్మరించినా..ఒక్కడినే పోటీచేస్తా అంటూ తొడగొట్టావు.. అనుకున్నది చేసి చూపించావు..ఐదేళ్ల పాలన తర్వాత నీకు మరో 25 సీట్లు ఎక్కువే ఇచ్చి ఆశీర్వదించారు జనం.. ఇది ఎలా సాధ్యం బాపూ…

ఇంతటి ఇనుప కండరాలు..ఉక్కు నరాలు కలిగిన బిడ్డను కన్న మాఈ తెలంగాణ తల్లి జన్మ ధన్యం కదా…నీ పథకాల్ని సాక్షాత్తూ దేశ ప్రధాని కూడా కాపీ కొడుతున్నాడు బాపూ.. ఇక నీకు తిరుగులేదు..రాష్ట్రాల అధికారాల్ని మింగేస్తూ.. చిన్నచూపు చూస్తున్న కేంద్రం మీద నువ్వెత్తిన బావుటా ఇక రెపరెపలాడటమే తరువాయి.. మీ మూడో ఫ్రంట్ స్వప్నం సాకారం అవడానికి ఎంతో దూరం లేదు..అది సాధిస్తావు..సంచలనం సృష్టిస్తావు..అందులో మాకెలాంటి డౌటూ లేదు..

kcr

నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే పూచీ మాది..ఎత్తిన జెండా దించకుండా..పట్టిన పంతం విడువకుండా నువ్వు సాగిపో బాపూ..నీ వెనుక తెలంగాణ జాతి మొత్తం ఏకమై నిలుచుంది..ఉంటుంది.. జయహో కేసీఆర్ అంటూ…జై కేసీఆర్.. మీరిలాంటి పుట్టినరోజులు వెయ్యి జరుపుకోవాలి..చిరంజీవిగా ఉండాలి…ఆ దేవదేవుడి ఆశిస్సులు మీకు నిండుగా ..మెండుగా ఉండాలని కోరుకుంటోంది గ్రేట్ తెలంగాణ టీవీ…

- Advertisement -