ఓటీటీలోనూ హనుమాన్ దూకుడు

26
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్ చిత్రాల్లో చోటు దక్కించుకోగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని రాబట్టింది.

5 రోజుల్లో ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసింది. ఇది ఓటీటీలో సరికొత్త రికార్డు కాగా త్వరలోనే మిగితా సౌత్ భాషల్లో రిలీజ్ కానుంది.

Also Read:TTD:తెప్పపై మ‌ల‌య‌ప్ప‌స్వామి విహారం

- Advertisement -