- Advertisement -
వేద మంత్రోత్సరణల మధ్య మండపంలో కొలువైన స్వామికి నిత్యం పంచామృతాభిషేకం చేస్తున్న అర్చక స్వాములు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో ప్రారంభమైన ద్విమండల అకండ హనుమాన్ చాలీసా పారాయణం 7 వరోజు భక్త జనం సందోహం మధ్య అంగరంగవైభవంగా కొనసాగింది.
ఆలయ స్దాన చార్యులు జితేంద్రస్వామి స్వామి ఆధ్వర్యంలో అర్చక స్వాములు మండపంలో కొలువైన ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకం చేయగా భక్తులు 11సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ హరిచరన్ రావు జగిత్యాల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి స్థానిక కౌన్సిలర్లు వివిధ గ్రామ ల సర్పంచులు పాల్గొన్నారు.
- Advertisement -