గొప్ప చరిత్ర సృష్టించిన ‘హను-మాన్’

26
- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. ఈనెల 12న విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ X వేదికగా ప్రకటించారు. సంక్రాంతి బరిలో స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నా, థియేటర్లు పరిమిత సంఖ్యలోనే దొరికినా రూ.100 కోట్లు వసూలు చేయడం విశేషం. అమృతా అయ్యర్‌ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది.మొత్తానికి హనుమాన్‌’ ప్రభంజనం దెబ్బకు మహేష్ బాబు సినిమాకి సైతం నష్టాలు తెచ్చింది.

అయితే, హనుమాన్ సినిమాకి వచ్చే కలెక్షన్స్ వెనుక, అయోధ్య రామాలయం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయం పున:ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ మేరకు రామ తీర్థ ఆలయ క్షేత్ర ట్రస్టు ఫొటోలు షేర్ చేయగా భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమా రిలీజ్ కావడంతో.. ఆ సినిమాకి బాగా కలిసి వచ్చింది.

దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు హీరో తేజా సజ్జకి కూడా ఈ సినిమా విజయం బాగా కలిసి వచ్చింది. నిజానికి ‘హను-మాన్’ బాక్సాఫీస్ వద్ద ఇంత దిగ్విజయంగా దూసుకెళ్తుంది అని ఎవరూ ఊహించలేదు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన 4 రోజుల్లోనే రూ.100 క్లబ్ లో చేరింది అంటే.. నిజంగా ఇది గొప్ప విజయం కింద లెక్కే. ఏది ఏమైనా స్టార్ హీరోల సినిమాలతో పాటు పోటీగా సంక్రాంతికి రిలీజైన.. టికెట్లు రేట్ల పెంపు లేకున్నా ఈ మూవీ రూ.100 కోట్లు కొల్లగొట్టడం ఓ చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది.

Also Read:ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా!

- Advertisement -