- Advertisement -
సీతారామంతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ని కొట్టారు దర్శకుడు హను రాఘవపూడి. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా, అందాల భామ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.
విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం అందరి మన్ననలు పొందింది. ఈ సినిమా హిట్‌తో హనుపై అంచనాలు పెరిగిపోగా తన నెక్ట్స్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు పనులు కూడా ముగించేశారని సమాచారం.
అయితే ఈ సారి ఓ హిస్టారికల్ ఫిక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకురానున్నారట. ఈ సినిమాలోని ఫిక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.
- Advertisement -