ప్రముఖ నటి హన్సిక తన భర్త సోహైల్ తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్ర కోర్టు ఈ జంట విడాకులను ఖరారు చేసిందని కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నప్పటికీ, ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ఇలాంటి సమయంలో హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టింది. చర్ది కాలా ఆల్వేస్ అనే పంజాబీ కొటేషన్‌ను ఆమె షేర్ చేసింది. దాని అర్థం ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా, పాజిటివ్‌గా ముందుకు సాగాలని సూచిస్తుంది. దీంతో తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతం ఇచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు.
హన్సిక, సోహైల్ కతూరియా వివాహం 2022 డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఆ పెళ్లి వేడుక సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీసింది. అయితే పెళ్లి అనంతరం కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమైనట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇటీవల హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్తతో ఉన్న ఫోటోలను తొలగించడం కూడా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
Also Read;‘పెద్ది’..క్రేజీ అప్‌డేట్

