ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఆయన బతికే ఉన్నారని కానీ గాయాల కారణంగా “డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు” అని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వ వర్గాల ప్రకారం మొజ్తబా ఖమేనీకి స్వల్ప గాయాలే అయ్యాయని, అయినప్పటికీ ఆయన తన బాధ్యతలను కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ టెలివిజన్ ఆయనను “యుద్ధంలో గాయపడిన నేత”గా పేర్కొంది.
ట్రంప్ మాట్లాడుతూ, “అతను బతికే ఉండొచ్చని నేను భావిస్తున్నాను. కొంత గాయపడ్డాడేమో కానీ ఏదో రూపంలో జీవించి ఉన్నాడనుకుంటున్నాను” అని అన్నారు.
తన తొలి వ్యాఖ్యలో మొజ్తబా ఖమేనీ..హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. అలాగే తమ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలు వాటిని మూసివేయాలని, లేకపోతే ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుందని పేర్కొన్నారు.
Also Read:‘పెద్ది’..క్రేజీ అప్‌డేట్
56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు. ఇరాన్ రాజకీయాల్లో చాలా కాలంగా ఆయన గోప్యంగా వ్యవహరించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆయన తండ్రి, భార్య మరణించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించలేదు.

