హన్సిక @ 105 మినిట్స్

18
Hansika

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ హన్సిక మోత్వాని. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించిన హన్సిక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తు మెప్పిస్తోంది. తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది ఈ బ్యూటీ.

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ, కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు హన్సిక.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. రుద్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోండగా సామ్ సి. యస్ సంగీతం సమకూర్చుతున్నారు.