సల్మాన్‌కు పిల్లలున్నారా..?

114
salman

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పెళ్లే కాలేదు..?పిల్లలుండటం ఏంటీ అనుకుంటున్నారా…? అవును ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సల్మాన్‌కు పెళ్లి అయిందని అతడికి నూర్ అనే భార్య, 17 ఏళ్ల కూతురు ఉందని వీరు దుబాయ్‌లో ఉన్నారని ఓ యూజర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇచ్చిన సమాధానం

ఇదే విషయాన్ని స‌ల్మాన్ త‌న త‌మ్ముడు అర్బాజ్ ఖాన్ షో పించ్‌లో పాల్గొన్న సంద‌ర్భంగా మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు షాక్‌ అయిన సల్మాన్….. ఈ ప్ర‌శ్న నాకేనా అని అడిగాడు. అవును నీకే అని అర్బాజ్ చెప్ప‌డంతో.. ఇదంతా అబ‌ద్ధం. వాళ్లు ఎవ‌రి గురించి మాట్లాడారో నాకు తెలియ‌దు. నాకు భార్య లేదు. నేను ఇండియాలోనే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటాను. 9 ఏళ్ల వ‌య‌సు నుంచీ అక్క‌డే ఉంటున్నాను. నేను ఇత‌ని కామెంట్స్‌పై స్పందించను అని స‌ల్మాన్ అన్నాడు.