హన్సికను కూడా తడిపేశారే..!

730
- Advertisement -

సంపత్ నంది చేసింది తక్కువ సినిమాలే కానీ.. అతడి పేరు వినిపించగానే ఒకరకమైన ఆసక్తి కలుగుతుంది. ‘ఏమైంది ఈవేళ’ లాంటి చిన్న సినిమాతో పరిచయమై.. రెండో సినిమానే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో చేసి సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత రవితేజతో బెంగాల్ టైగర్ సినిమాతో మరోసారి టాప్ డైరెక్టర్‌లకు కమర్షీయల్‌గా పోటీకి వచ్చాడు.. గ్యాంగ్ లీడర్ చిత్రంలో ‘వానా వానా వెల్లువాయె, కొండ కోనా తుళ్లిపోయె’ అంటూ ‘ చిరంజీవి, విజయశాంతి వేసిన స్టెప్టులు అభిమానులను గిలిగింతలు పెట్టాయి.

tamanna-backless

అదే పాటను చెర్రీ, తమన్నాలపై తెరకెక్కించాడు.. ఆ పాటకు బాగానే రెస్పాన్స్ వచ్చింది.. ఆ తరువాత మాస్ మహరాజ రవితేజ, తమన్నాలను మరోసారి వర్షంలో తడిపిన సంపత్‌… హీరోయిన్లను వర్షం తడుపుతూ పాటలను చిత్రీకరించడంలో కూడా అంతే సిద్ధహస్తుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి వానలో మరో హీరోయిన్‌ను తడిపేందుకు సిద్దమయ్యాడు సంపత్..

tamanna rain song in bengal tiger

గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన ‘గౌతమ్ నంద’ సినిమాలో కూడా ఓ రెయిన్ సాంగ్ ఉండబోతుదంటూ హింట్ ఇస్తున్నాడు సంపత్‌. ఈ ఫోటోలో హన్సిక పూర్తిగా వర్షంలో తడిసి తన అందాలను ప్రేక్షకులపై జల్లబోతున్నట్లుగా కనిపిస్తుంది. ఆడియో వేడుకలో కూడా ఇదే పాటను వాడుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ పాట సినిమాకు హైలెట్ కాబోతుందని.. ‘రచ్చ, బెంగాల్ టైగర్’ సినిమాలలోని పాటలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు తెలుస్తోంది..

hansika in rain

- Advertisement -