హన్సిక ‘టైమ్ బాంబ్’

171
Hansika Has Got A Title – 'Time Bomb'
- Advertisement -

పాల‌బుగ్గ‌ల హ‌న్సిక దేశ‌ముదురు సినిమాతో క‌థానాయిక‌గా తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమాతోనూ యూత్ గుండెల్ని ట‌చ్ చేసింది. ద‌శాబ్ధంపైగానే స్టార్‌డ‌మ్‌ని కొన‌సాగిస్తూ తెలుగు, త‌మిళ్‌, హిందీలో నాయిక‌గా కొన‌సాగుతోంది.  ఈ అందాల తారకు  తమిళ ఇండస్ట్రీలో మరో పేరు కూడా వచ్చింది. ఆమెను ‘టైమ్ బాంబు’గా అభివర్ణిస్తున్నారు.

ఆమెను ‘టైమ్ బాంబు’గా ఎందుకు అంటున్నారో హన్సికనే స్వయంగా చెప్పింది…. సినిమా షూటింగ్‌లకు తాను కరెక్ట్ టైమ్‌కు వస్తానంటోంది. షూటింగ్ షెడ్యూల్‌కంటే పదినిమిషాల ముందే సెట్స్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. దీంతో హన్సికను కోలీవుడ్‌లో అందరూ ‘టైమ్ బాంబు’ అని అంటున్నారట. ఇక ట్విట్టర్‌లో తన అభిమానులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటోంది ఈ భామ. తన సినిమాల అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వారిని పలకరిస్తోంది.

ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుని వారి పోష‌ణ చూస్తూ సామాజిక బాధ్య‌త‌లోనూ పై స్థాయిలో ఉందీ భామ‌.అభిమానుల ప్రేమాభిమానాలతోనే కోలీవుడ్‌లో తాను కథానాయికగా అగ్రస్థానానికి చేరుకోగలిగానని హన్సిక చెబుతోంది. తెలుగులో ఇటీవల ‘గౌతమ్‌నంద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ.

- Advertisement -