- Advertisement -
తెలంగాణలో ఎండల తీవ్రత ముదురుతుండటంతో ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నట్లు తెలిపింది విద్యాశాఖ. ఒంటిపూట బడులు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నట్లు ప్రకటించారు విద్యాశాఖ కమిషనర్ చిత్రారామచంద్రన్.
మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. అలాగే ఏప్రిల్ 23వ తేదీ నుంచి స్కూల్స్ కు వేసవి సెలవులు ఉంటాయని.. జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు.
- Advertisement -