హాథీ మేరే సాథీలో రానా

216
Haathi Mere Saathi first look
- Advertisement -

బాహుబలి తర్వాత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు రానా. ఘాజీ,నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులను డీల్ చేస్తున్న రానా..హాథీ మేరే సాథీ రిమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు.

1971లో రాజేష్ ఖన్నా హీరోగా వచ్చిన ఈ హిందీ సినిమా ఒక క్లాసిక్. ఈ సినిమాను తమిళ దర్శకుడు ప్రభు సోలోమాన్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో బన్దేవ్ పాత్రను పోషిస్తున్నాడు రానా. ఏనుగు తొండంపైన కూర్చున్న రానా ఫస్ట్ లుక్ ఇప్పుడు న్యూ ఇయర్ సందర్బంగా రిలీజ్ చేశారు. గతంలో గజరాజు (తమిళంలో కుంకీ) సినిమాను తీసిన ప్రభు.. ఏనుగులు అంటే భలే ప్రాణం ఇచ్చేస్తాడు. అందుకే అతడు రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ సినిమాకు తెలుగులో అడవి రాముడు అనే టైటిల్ ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడవి రాముడు టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దీంతో హాథీ మేరీ సాథీ సినిమా కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని భావిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Haathi Mere Saathi first look

- Advertisement -